HomeTelugu Trendingఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్': మామా బ్రష్షే వేస్కో సాంగ్‌ విడుదల

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’: మామా బ్రష్షే వేస్కో సాంగ్‌ విడుదల

Brush Vesko Lyrical from
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్, టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’. వక్కంతం వంశీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా హే మామా బ్రష్షే వేస్కో… మైండంతా రిఫ్రెష్ చేస్కో అంటూ సాగే హుషారైన సాంగ్ విడుదలైంది.

హ్యారిస్ జయరాజ్ తన ట్రేడ్ మార్క్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ఈ పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం పంచుకుంది. ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్ష వర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్ర నరేశ్, హైపర్ ఆది, హరితేజ, పృథ్వీ తదితరులు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu