HomeTelugu Big Storiesఅదరగొట్టిన బన్నీ బుట్టబొమ్మ సాంగ్

అదరగొట్టిన బన్నీ బుట్టబొమ్మ సాంగ్

12 12

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైంకుఠ పురం సినిమాలోని బుట్ట బొమ్మ..నన్ను సుట్టుకొంటివే..జిందగీకే ఆటబొమ్మై…జంట కట్టుకుంటివే..అంటూ సాగిన రొమాంటిక్ సాంగ్..అభిమానులను అలరిస్తోంది. డిసెంబర్ 24న విడుదలైన ఈ పాట కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్‌లో వైరల్ అయిపోయింది. 4 లక్షల మందికి పైగా పాటను చూశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రీ రచించగా ఆర్మాన్ మాలిక్ స్వరకూర్చారు. మ్యూజిక్‌ను థమన్ అందించారు.

సినిమా షూటింగ్‌కు సంబంధించిన క్లిప్పింగ్స్‌తో సాంగ్ సాగింది. చివరిలో ఆర్మాన్ మాలిక్ పాట పాడుతూ కనిపించారు. తమన్ సంగీతం అందించిన సామజవరగమన, రాములో రాములా..అనే పాటలు యూ ట్యూబ్‌లో కొత్త రికార్డులు సాధించాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్వకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. సుశాంత్, నివేదా, టబు, జయరామ్, నవదీప్‌లు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu