తాప్సీకు నిరాశే ఎదురైంది!

వరుస ఫ్లాప్ లు తాప్సీను పలకరించడంతో టాలీవుడ్ లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో తన మకాంను బాలీవుడ్ కు షిఫ్ట్ చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి.  పింక్, బేబీ ఇలా పలు చిత్రాలు నటిగా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. తను కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎన్నుకుంటూ.. సినిమాల్లో వైవిధ్యతను చూపిస్తోంది. అయితే తాజాగా తాప్సీ నటించిన ‘ఘాజీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రానాను మిగిలిన క్యారెక్టర్స్ ను పొగుడుతున్నారే.. తప్ప తాప్సీ గురించి మాత్రం ఎవరు మాట్లాడుకోవడం లేదు. ఎందుకంటే సినిమాలో ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. మళ్ళీ ఈ సినిమా కోసం ఆమె బెంగాలీ కూడా నేర్చుకుందట. మొత్తం సినిమాలో ఆమె బెంగాలీలో చెప్పింది ఒక్క డైలాగ్ మాత్రమే.. దీనికోసం బాష నేర్చుకోవడం ఏమిటో.. అంటూ ఆమెపై కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే దర్శకుడు ఫైనల్ ఎడిటింగ్ లో తాప్సీ సన్నివేశాలను ఎడిట్ చేసేశాడట. దీంతో అమ్మడు తెగ ఫీల్ అయిపోతుంది.