HomeTelugu Trending‘యాత్ర’ డైరెక్టర్‌తో బన్నీ

‘యాత్ర’ డైరెక్టర్‌తో బన్నీ

Bunny with Mahi V Raghav
స్టైలిస్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తాజాగా సుకుమార్ డైరెక్షన్‌ లో ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన ఆర్య, ఆర్య 2 మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కు ట్రై చేస్తున్నారు. దానిలో భాగంగానే సుకుమార్ బన్నీ కోసం పాన్ ఇండియా స్థాయి లో పుష్ప అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు తో పాటు ఈ మూవీ నాలుగు భాషల్లో విడుదల కానుంది. ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత బన్నీ మరో క్రేజీ దర్శకుడికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ముందుగా ఆనందో బ్రహ్మ, ఆ తర్వాత వై.యస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’ సినిమా తెరక్కెక్కించి హిట్ అందుకున్న మహి. వి. రాఘవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పూర్తి స్క్రిప్ట్‌తో వస్తే సినిమా చేస్తానని చెప్పాడట బన్నీ! ప్రస్తుతం దర్శకుడు ఆ పనిలోనే ఉన్నడంట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu