HomeTelugu Trendingఆ విషయం బోయపాటినే అడగండి..

ఆ విషయం బోయపాటినే అడగండి..

9 6
హీరోయిన్‌ కేథ‌రిన్ థ్రెసా.. తాజాగా క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో ఓ పాత్ర చేస్తోంది. ఈ చిత్రంలో కేథరిన్‌తో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్.. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా లైట్ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 14న ప్రేమికుల దినోత్సం సందర్భంగా విడుదలకాబోతుంది. ఈ నేపధ్యంలో కేథరిన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో స్మిత అనే అమ్మాయి పాత్ర చేస్తున్నానని.. బొగ్గు గనిలో పనిచేసే అధికారిగా కనిపిస్తానని ఆమె తెలిపింది. ఓ ప్రశ్నకు సమాధానంగా బోయపాటి శ్రీనివాస్, బాలకృష్ణ సినిమాలో నేను నటిస్తున్నానంటూ చాలా చోట్ల వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా దర్శక నిర్మాతలు నన్ను సంప్రదించినట్లు చెప్పుతున్నారు. దీంతో ఈ సినిమా విషయం గురించి చాలామంది మీలాగే నన్ను అడుగుతున్నారు. అయితే ఈ విషయంలో నేను చెప్పేది ఒక్కటే.. ‘బాలకృష్ణ సినిమాలో నేను నటిస్తున్నానో లేదో తెలియాలంటే మాత్రం ఆ విషయాన్ని ఆ సినిమా దర్శకుడు బోయపాటినే అడగండంటూ షాక్ ఇచ్చింది కేథరిన్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu