HomeTelugu Trendingదర్శకుడిగా మారిన జబర్దస్త్‌ కమెడియన్

దర్శకుడిగా మారిన జబర్దస్త్‌ కమెడియన్

Jabardasth comedian RP turn

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వార ఎందరో నటులు వెలుగులోకి వచ్చారు. అయితే కేవలం నటులు మాత్రమే కాదు టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. కొందరు ఇప్పటికే ఇండస్ట్రీలో సత్తా చూపిస్తున్నారు. తాజాగా మరో కమెడియన్ కూడా మెగాఫోన్ పడుతున్నాడు. అతడే కిర్రాక్ ఆర్పీ. ఇతడు మెగాఫోన్ పట్టబోతున్నాడు. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నాడు ఆర్పీ.అతడు చెప్పిన కథ నచ్చి సినిమా తీయడానికి అరుణాచలం అనే నిర్మాత ముందుకు రావడంతో తాత్కాలికంగా నటనకు విరామం ఇచ్చి స్టోరీ, స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నాడు ఆర్పీ. తాజాగా సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది.

జేడీ చక్రవర్తి, ప్రకాశ్ రాజ్, రావు రమేష్ లాంటి నటులు ఇందులో నటించబోతున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఈ కమెడియన్. అసలు తను ఇండస్ట్రీకి వచ్చింది దర్శకుడు కావాలనే అంటూ ముందు నుంచి చెప్తున్నాడు ఈయన. ‘జబర్దస్త్’తో ఆర్పీకి మంచి గుర్తింపు వచ్చినప్పటికీ నాగబాబు వెంటనే ఆయన కూడా అదిరింది షోలో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అదిరింది కూడా ఆపేసి పూర్తిగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంపై ఫోకస్ చేశాడు ఆర్పీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu