HomeTelugu Trending'క్యాలీఫ్లవర్‌' ట్రైలర్‌

‘క్యాలీఫ్లవర్‌’ ట్రైలర్‌

cauliflower trailer

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్‌ బాబు నటించిన తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్‌’.ఆర్‌.కె.మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా విభిన్నమైన కథతో ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘క్యాలీఫ్లవర్‌’ ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. ‘‘ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్‌ గురించే చర్చ’’, ‘‘పార్లమెంట్‌ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్‌’’, ‘‘వీడెవడో ఒక్కరోజులోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసేలా ఉన్నాడు’’ అనే డైలాగ్‌లతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. సంపూర్ణేశ్‌బాబు నటన, ఆయన సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘‘ఈ ఊర్లో పుట్టిన మనుషులకైనా, జంతువులకైనా ఒక్కటే భర్త, ఒక్కటే భార్య.. ఇదే ఈ క్యాలీఫ్లవర్‌ రూల్‌’’ అంటూ ఆయన చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది. మధుసూదన క్రియేషన్స్‌, రాధాకృష్ణ టాకీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవంబర్‌ 26న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu