HomeTelugu Trending‘శీలో రక్షతి రక్షిత:' క్యాలీఫ్లవర్‌ పోస్టర్‌ థీమ్‌.. వైరల్‌

‘శీలో రక్షతి రక్షిత:’ క్యాలీఫ్లవర్‌ పోస్టర్‌ థీమ్‌.. వైరల్‌

Cauliflower title theme pos
టాలీవుడ్‌ నటుడు బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేశ్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం క్యాలీఫ్లవర్‌. ఆర్కే మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని గూడురు శ్రీధర్‌ సమర్పణలలో మధుసూదన క్రిమేషన్స్‌, రాధాకృష్ణ టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్‌ క్యాలీప్లవర్‌ టైటిల్‌ థీమ్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఇంగ్లాండ్‌ నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లీష్‌ మ్యాన్‌గా సంపూ కనిపించనున్నాడు.

ఈ టైటిల్‌ థీమ్‌లో సంపూ నగ్నంగా.. ఒంటిపై ఒక్క నూలుపోగు లేకుండా కేవలం క్యాలీఫ్లవర్‌ అడ్డుగా పెట్టుకుని ధర్నాకు దిగిన ఈ పోస్టర్‌ చూస్తుంటే సినిమాపై మరింత అసక్తిని పెంచుతోంది. ఈ టైటిల్‌ థీమ్‌కు ‘శీలో రక్షతి రక్షిత:’ అనే ట్యాగ్‌లైన్‌ ఉంది. ఈ మూవీలో వాసంతి హీరోయిన్‌గా నటిస్తుంది. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుంది. ఇందులో పోసాని కృష్ణమురళి, నాగ మహేశ్‌, గెటప్‌ శ్రీను, రోహిణి, గౌతం రాజు తదితరలు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu