HomeTelugu Big Storiesరియాను సీబీఐ అడిగిన 10 ప్రశ్నలు..

రియాను సీబీఐ అడిగిన 10 ప్రశ్నలు..

CBI Questioned for rhea onబాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సీబీఐ విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా శుక్రవారం అధికారులు మరోసారి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాను విచారించారు. ఈ సంధర్భంగా రియాపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. రియాను అడిగిన ప్రశ్నల్లో కీలకమైన 10 ప్రశ్నలు ఇవే.

సుశాంత్ మరణం గురించి మీకు ఎవరు తెలిపారు. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. మరణం గురించి తెలిసిన వెంటనే మీరు బాంద్రాలోని అతని నివాసానికి వెళ్లారా. ఒకవేళ వెళ్లకపోతే… అతని డెడ్ బాడీని ఎప్పుడు, ఎక్కడ చూశారు. జూన్ 8వ తేదీన (సుశాంత్ మరణానికి 6 రోజుల ముందు) సుశాంత్ ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయారు.ఏదైనా గొడవపడి అక్కడి నుంచి వెళ్లిపోయారా. సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత… జూన్ 9వ తేదీ నుంచి 14 మధ్య అతనితో ఎప్పుడైనా మాట్లాడారా. మాట్లాడి ఉంటే… దేని గురించి. అదే సమయంలో మీతో మాట్లాడేందుకు సుశాంత్ ప్రయత్నించాడా. అతని కాల్స్ ను, మెస్సేజ్ లను మీరు పట్టించుకోలేదా. ఒకవేళ అతని కాల్స్ ను మీరు పట్టించుకోని పరిస్థితుల్లో… అతని నంబర్ ను ఎందుకు బ్లాక్ చేశారు. మీ కుటుంబ సభ్యులను కలిసేందుకు సుశాంత్ ప్రయత్నించాడా. సుశాంత్ కు ఉన్న అనారోగ్య సమస్యలు ఏమిటి. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నాడా. డాక్టర్లు, సైకియాట్రిస్టులు, మెడికేషన్ వివరాల గురించి చెప్పండి. సుశాంత్ కుటుంబంతో మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది. ఈ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని మీరు ఎందుకు కోరారు. ఇందులో నేరపూరితమైన చర్య ఏదైనా వుందని భావించారా అని ప్రశ్నించారు. రియా సోదరుడిని కూడా సీబీఐ వేరుగా ప్రశ్నించింది. వీరిద్దరి సమాధానాలను సీబీఐ అధికారులు పరిశీలించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu