HomeTelugu Trendingడైరెక్టర్‌ బర్త్‌డే.. స్టార్‌ హీరోల సందడి

డైరెక్టర్‌ బర్త్‌డే.. స్టార్‌ హీరోల సందడి

6 1స్టార్‌ డైరెక్టర్‌ కోదండరామిరెడ్డి సోమవారం తన 70వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసంలో నిర్వహించిన వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్‌, ఎమ్మెస్‌ రాజు, అశ్వనీదత్‌, దిల్‌రాజు, అనిల్‌ సుంకర, బి.గోపాల్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్‌, కోటి, తదితరులు పాల్గొన్నారు.

కోదండరామిరెడ్డి తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలను తెరకెక్కించారు. ఆయన కెరీర్‌లో చిరంజీవితో చేసిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. న్యాయం కావాలి, ఖైదీ, అభిలాష, ఛాలెంజ్‌, రాక్షసుడు, పసివాడి ప్రాణం, కొండవీటి దొంగ తదితర చిత్రాలను తెరకెక్కించారు. ఆయన చివరగా 2009లో వచ్చిన ‘పున్నమి నాగు’ సినిమాకు దర్శకత్వం వహించారు. కోదండరామిరెడ్డి కుమారుడు వైభవ్‌ రెడ్డి పలు చిత్రాల్లో హీరోగా నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu