HomeTelugu Trendingనేను మీకు బాగా కావాల్సినవాడిని: "చాలా బాగుందే" సాంగ్‌ విడుదల

నేను మీకు బాగా కావాల్సినవాడిని: “చాలా బాగుందే” సాంగ్‌ విడుదల

Chala Bagundhe Lyrical Vide

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ సినిమాని నిర్మించారు. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో.. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

తాజాగా సినిమాలోని “చాలా బాగుందే” అనే లిరికల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సారధ్యంలో వచ్చిన ఈ మెలోడీ సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటోంది. ‘చాలా బాగుందే ఈ ప్రయాణం.. నాతో వస్తోందే.. నా సంతోషం’ అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటుంది.

భాస్కర భట్ల అందించిన సాహిత్యం మరియు సింగర్ ఆదిత్య అయ్యంగార్ ఆకట్టుకునే గానం ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ దర్శకుడు నటుడు ఎస్.వి కృష్ణారెడ్డి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu