HomeTelugu News'చంద్రోదయం' ఫస్ట్‌లుక్‌

‘చంద్రోదయం’ ఫస్ట్‌లుక్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘చంద్రోదయం’. ఈ సినిమాని వెంకట రమణ దర్శకత్వం వహిస్తుండగా జి.జె. రాజేంద్ర నిర్మిస్తున్నారు. చంద్రబాబుగా వినోద్‌ నువ్వుల, ఎన్టీఆర్‌గా భాస్కర్‌ నటిస్తున్నారు. రాజ్‌కుమార్‌ పీఆర్‌ బాణీలు అందిస్తున్నారు. అక్టోబరు 18న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.

9 21

ఈ సినిమాలో చంద్రబాబు లుక్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో వినోద్‌ సైకిల్‌పై కనిపించారు. చంద్రబాబులా రెండు వేళ్లతో ప్రజలకు అభివాదం చేశారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ 80 శాతం పూర్తయినట్లు దర్శకుడు చెప్పారు. ‘దేశచరిత్రలోనే ఒక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు. సామాన్య కుటుంబంలో జన్మించి, అగ్ర స్థానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియాలనే ఈ చిత్రాన్ని తీస్తున్నాం. చంద్రబాబు చిన్ననాటి జీవితం నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu