చరణ్ కు, సుక్కు అలా మాటిచ్చాడట!

sukku

విభిన్న చిత్రాలను రూపొందిస్తూ యూత్ లో ప్రత్యేకమైన గుర్తింపును పొందిన దర్శకుడు
సుకుమార్. రీసెంట్ గా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని రూపొందించిన సుకుమార్ ఇప్పుడు
చరణ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ నటిస్తోన్న ‘దృవ’ సినిమా
విడుదలయిన వెంటనే అక్టోబర్ లోనే సుకుమార్ సినిమా షూటింగ్ మొదలుకానుందని
ఇదివరకే చెప్పారు. నిజానికి సుకుమార్ ఒక సినిమా చేయడానికి చాలా సమయం తీసుకుంటాడు.
దీంతో ఈ కాంబినేషన్ ఎప్పటికీ పూర్తవుందో అని.. అభిమానులు ఆలోచనలో పడ్డారు. అయితే
సుకుమార్ మాత్రం చరణ్ ను కలిసి వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి సినిమాను పూర్తి చేసి
అదే నెలలో విడుదలయ్యేలా చూస్తానని మాటిచ్చాడట. నాలుగు నెలల్లో సినిమా పూర్తి
చేస్తానని చెప్పడంతో చరణ్ ఫుల్ ఖుష్ అయ్యాడని చెప్పుకుంటున్నారు.