HomeTelugu Trendingఫైటర్‌ స్ర్కిప్టులో మార్పు.. చార్మి నిర్ణయం

ఫైటర్‌ స్ర్కిప్టులో మార్పు.. చార్మి నిర్ణయం

4 18
యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా స్క్రిప్టులో మార్పులు చేశారంటూ వస్తున్న సందేహాలపై నిర్మాత చార్మి సమాధానం ఇచ్చింది.

‘ఫైటర్’ స్క్రిప్టుకు తిరుగులేదని, అందులో మార్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత షూటింగ్ మొదలవుతుందని వెల్లడించారు. ఫైటర్ స్క్రిప్టుపై పూర్తి నమ్మకం ఉందని, ఈ సినిమా రీయల్‌ టైటిల్ కూడా త్వరలోనే వెల్లడిస్తాము అని తెలిపారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ జంటగా అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్ర నిర్మాణంలో బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జొహార్ కూడా భాగస్వామి. ఇప్పటికే ముంబయిలో కొంతభాగం చిత్రీకరణ జరిగింది. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu