HomeTelugu Trendingసోహైల్‌తో సినిమా ప్రకటించిన జార్జిరెడ్డి నిర్మాతలు

సోహైల్‌తో సినిమా ప్రకటించిన జార్జిరెడ్డి నిర్మాతలు

Bigg boss 4 fame sohel moviతెలుగు ‘బిగ్‌బాస్-4’ ఫేం సోహైల్‌ గురించి ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. తనదైన స్టైయిల్‌, యాసలో నెటిజన్లను ఆకట్టుకున్నాడు. తాజాగా సోహైల్‌కు ఓ సినిమాలో హీరోగా నటించనున్నాడు. ఈ విషయాన్ని ఆ సినిమా బృందం అధికారికంగా ప్రకటించింది. జార్జిరెడ్డి, ప్రెజర్ కుక్కర్ వంటి సినిమాలను నిర్మించిన అప్పిరెడ్డి సోహైల్‌తో ఓ సినిమా నిర్మిస్తున్నారు. దీనికి శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించనున్నారు.

ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ఆ సినిమా యూనిట్ ప్రకటించింది. త్వ‌ర‌లోనే ఈ చిత్ర టైటిల్‌తో పాటు క్రూ అండ్ క్యాస్ట్ ప్ర‌క‌టించ‌నున్నారు. హీరోగా సోహెల్ కొత్త ప్రయాణం మొదలు పెట్టనున్నాడు. కాగా, బిగ్‌బాస్‌లో సోహైల్ గ్రాండ్ ఫినాలె వరకు వెళ్లి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. చివరకు 25 లక్షలు ప్రైజ్ మనీ తీసుకుని బిగ్‌బాస్ నుంచి వైదొలిగాడు. సోహైల్ చేయనున్న సినిమాను ప్రమోట్ చేస్తామని బిగ్‌బాస్‌ గ్రాండ్ ఫినాలెలో చిరంజీవి, నాగార్జున చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu