HomeTelugu Trendingమా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు: చిరంజీవి

మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు: చిరంజీవి

3 9
ఈ రోజు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు, సెలబ్రెటీలు అందరూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, “60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.

ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. ప్రియమైన బాలకృష్ణా… నువ్వు అరవైల్లోకి అడుగుపెట్టావు. నీ అద్భుతమైన ప్రయాణాన్ని నేను ఎంతో ప్రేమగా గుర్తుచేసుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు చిరంజీవి‌. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!