HomeTelugu Trendingరానాకు మెగాస్టార్ ట్వీట్.. వైరల్‌

రానాకు మెగాస్టార్ ట్వీట్.. వైరల్‌

3a 1
టాలీవుడ్ యంగ్ హీరో రానా ట్విట్టర్ ద్వారా తన ప్రియురాలి అంగీకరించింది అంటూ అనౌన్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం సాయంత్రం సోషల్‌ మీడియాలో ఆయనో పోస్ట్‌ విడుదల చేశారు. అందులో ఓ అమ్మాయి ఉంది. ఆ ఫొటోలో ‘షి సెడ్‌ ఎస్‌’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆఖరిలో వీరిద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే పలువురు రానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఆశీస్సులు అందించారు. ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా అంశాలపై స్పందిస్తున్న చిరంజీవి… రానా ఇష్యూపై కూడా రియాక్ట్ అయ్యారు. కంగ్రాట్స్ మై బాయ్.. భల్లాలదేవ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు అన్నమాట అంటూ కామెంట్ చేశారు. ఈ లాక్‌డౌన్ ఓ రకంగా మంచే చేసింది నీకు వెడ్డింగ్ లక్ తీసుకొచ్చింటూ ఆశీర్వదించారు. మెగాస్టార్ ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu