HomeTelugu Trendingఇకపై అటువంటి పాత్రలు చేయను అంటున్న విజయ్‌ సేతుపతి!

ఇకపై అటువంటి పాత్రలు చేయను అంటున్న విజయ్‌ సేతుపతి!

Crazy Rumors on Vijay Sethu

తమిళ నటుడు విజయ్ సేతుపతి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సాధారణంగా ఒక భాషలో హీరోగా చేస్తున్నప్పుడు, అదే భాషలో విలన్ గా చేయడానికి ఎవరూ ఒప్పుకోరు. కానీ విజయ్ సేతుపతి మాత్రం ఒక వైపున స్టార్ హీరోగా చేస్తూనే మరో వైపున స్టార్ విలన్ గా చేస్తూ తన ప్రత్యేకతను చాటుతూ వెళుతున్నాడు.

అందుకు ఉదాహరణగా ‘మాస్టర్’, ‘విక్రమ్’ సినిమాలు. ఇక మరో వైపున ఆయన ఇతర భాషలల్లోనూ స్టార్‌ విలన్ గా దూసుకుపోతున్నాడు. తెలుగులో ‘ఉప్పెన’ సినిమాలో విలన్‌గా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ఈ మధ్య బాలీవుడ్ లో ‘జవాన్’ సినిమాలోను కీలకమైన రోల్ చేసి, అక్కడి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

ఇలా ఆయన ముఖ్యమైన పాత్రలను పోషించిన కొన్ని సినిమాలు విడుదలకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై తాను విలన్ రోల్స్ గానీ .. గెస్టు రోల్స్ గాని చేయదలచుకోవడం లేదని విజయ్ సేతుపతి అన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇకపై అలాంటి పాత్రలకు తనని అడగొద్దని ఆయన చెప్పినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. అయితే ఈవార్తలో ఎంత నిజం ఉందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu