HomeTelugu Trendingక‌ద‌ల‌లేని స్థితిలో కైకాల‌, బెడ్‌పైనే కేక్ క‌ట్ చేయించిన చిరంజీవి.. వైరల్‌

క‌ద‌ల‌లేని స్థితిలో కైకాల‌, బెడ్‌పైనే కేక్ క‌ట్ చేయించిన చిరంజీవి.. వైరల్‌

Chiranjeevi celebrates kaik
టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు కైకాల సత్య‌నారాయ‌ణ‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. వ‌య‌సు రీత్యా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న కైకాల ప్ర‌స్తుతం బెడ్‌పైనే చికిత్స తీసుకుంటున్నారు. దాదాపుగా క‌ద‌ల‌లేని స్థితిలో ఉన్న ఆయ‌న వ‌ద్ద‌కు చిరు స్వ‌యంగా వెళ్లారు. ఈ సంద‌ర్భంగా త‌న వెంట బ‌ర్త్ డే కేక్ తీసుకెళ్లిన చిరు… బెడ్‌పై దానిని పెట్టి కైకాల‌ చేత క‌ట్ చేయించారు.

ఈ సంద‌ర్భంగా కైకా‌ల‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాన‌ని, అది త‌న‌కు ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చిందని చిరు పేర్కొన్నారు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానంటూ ఆయన ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా కైకాల సత్యనారాయణ కేక్ క‌ట్ చేస్తున్న ఫొటోల‌ను చిరంజీవి సోష‌ల్ మీడియాలో షేర్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu