మూడోసారి తల్లి అయిన రంభ

సీనియర్‌ స్టార్ హీరోయిన్ రంభ మూడో బిడ్డకు జన్మినిచ్చింది. ఆమె భర్త ఇంద్రకుమార్ ఇన్‌స్ట్రాగ్రమ్‌ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. కెనడాలోని టొరంటోలో ఈ నెల 23న తేదీన రంభ మగబిడ్డను జన్మనించింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు సమాచారం. 2010లో వివాహం చేసుకున్న రంభ, ఇంద్రకుమార్ లకు ఇదివరకే లాన్య, సాషా అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ‘హిట్లర్, బావగారు బాగున్నారా, ఆ ఒక్కటీ అడక్కు, బొంబాయి ప్రియుడు, గణేష్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రంభ చివరగా 2008లో ‘దొంగ సచ్చినోళ్ళు’ అనే తెలుగు చిత్రంలో కనిపించారు. వివాహం తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తరువాత పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.