ఇది కదా నీ కథ.. అంటున్న ‘మహర్షి’

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’ మరోఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ట్రైలర్ తో అంచనాలు పెంచుకున్న మహర్షి, ఆ సినిమాకు తగ్గట్టుగా ఆల్బమ్ లేదనే టాక్ వచ్చింది. మహేష్ వంటి స్టార్ హీరో సినిమాకు ఇలాంటి ట్యూన్స్ ఏంటని నెటిజన్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మామూలు సాంగ్స్ తో పాటు థీమ్ సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్ ను ఈరోజు ఉదయం రిలీజ్ చేశారు.

ఇది కదా నీ కథ… ఓ నీటి బిందువేగా నువ్వు వెతుకుతున్న సంపద అనే పల్లవితో సాగే ఈ సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ సాంగ్ తో అంచనాలు మరింతగా పెరిగాయి. అమెరికాలో వేలకోట్ల రూపాయల బిజినెస్ సామ్రాజ్యాన్ని వదిలేసి… తిరిగి ఇండియాకు ఎందుకు వచ్చాడు… నాగలి ఎందుకు పట్టుకోవలసి వచ్చింది అనే కథాంశంతో సినిమా ఉంటుందని ఈ సాంగ్ ను చూస్తే అర్ధం అవుతుంది. సేద్యం చేసేందుకు రైతులు పడుతున్న బాధలను, నీటి చుక్కకోసం రైతుల ఎదురుచూపులు, వాళ్ళ కోసం మహేష్ చేసే పోరాటాన్ని సినిమాలో చూపించబోతున్నారని అర్ధం అవుతున్నది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్‌. అల్లరి నరేష్‌, మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌ రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates