
Thalapathy 69 update:
తలపతి విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న Thalapathy 69 సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమా విజయ్ రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమా కావడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజు, ప్రియమణి వంటి నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
అయితే, ఈ సినిమా విషయంలో రూమర్స్ గురించి ఎక్కువ చర్చ జరిగింది. Thalapathy 69 సినిమా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్ అని మొదట వార్తలు వచ్చాయి. ఈ వార్తలు విజయ్ అభిమానులను కొంత నిరాశపరిచాయి. ఫ్యాన్స్‌కి విజయ్ చివరి సినిమా రీమేక్ కాకుండా ఒరిజినల్‌గా ఉండాలని కామెంట్స్ చేశారు.
This not remake Bhagavanth kesari
This pakka commercial 200 % of thalapathy Vijay flim 📉💥
Official Words from H.Vinoth 💥#Thalapathy69 @actorvijay pic.twitter.com/OeAlHFQ27M
— Rocky Bhai (@Rockyy__420) January 3, 2025
తాజాగా, దర్శకుడు హెచ్ వినోద్ మీడియాతో మాట్లాడుతూ ఈ రూమర్‌పై క్లారిటీ ఇచ్చారు. “Thalapathy 69 రీమేక్ కాదు. ఇది 200% ఒరిజినల్ కమర్షియల్ సినిమా” అని స్పష్టం చేశారు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విజయ్‌కి మెమరబుల్ ఫేర్‌వెల్ అవుతుందని ఆశిస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్స్ మొదలుపెట్టారు.
మొత్తానికి, Thalapathy 69 సినిమా పట్ల అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందా? లేదా? దర్శకుడు హెచ్ వినోద్, విజయ్ కలయికలో మరో సక్సెస్ సినిమా వస్తుందా అనేది చూడాలి!
ALSO READ: ఏపీ లో Game Changer టికెట్ రేట్లు ఎప్పటిదాకా ఎక్కువగా ఉంటాయంటే!