HomeTelugu Trendingడైరెక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌

డైరెక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌

Chiranjeevi gave a small gi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా డైరెక్టర్‌ కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) ఓ చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. దర్శక రచయితగా కాకుండా ఓ అభిమానిగా చిరంజీవి కోసం వినూత్న కథని సిద్ధం చేస్తున్నారాయన. ఇదిలా ఉండగానే చిరంజీవి నుంచి ప్రత్యేక బహుమతి అందుకున్నారు బాబీ. అదేంటంటే.. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవిని కలిశాడు బాబీ. బాబీకి శుభాకాంక్షలు తెలిపి, ఓ పెన్నుని కానుకగా అందించారు చిరంజీవి. బాబీ.. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంటూ.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘కోట్లాదిమంది మీ అభిమానుల్లో ఒకడినైన నేను మిమ్మల్ని డైరెక్ట్‌ చేస్తుండటం ఆనందంగా ఉంది. నా కల నిజమైంది. మీరిచ్చిన బహుమతికి ప్రత్యేక కృతజ్ఞతలు సర్‌’ అని చిరంజీవిని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. పలు సూపర్‌హిట్‌ చిత్రాలకు రచయితగా పనిచేసిన బాబీ ‘పవర్‌’తో దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలో విజయం అందుకున్న ఆయన ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’, ‘జై లవకుశ’, ‘వెంకీమామ’ చిత్రాల్ని అందించారు. చిరంజీవితో త్వరలోనే ఓ క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu