HomeTelugu Trending'విరాట పర్వం' సినిమాపై రాఘవేంద్ర రావు ప్రశంసలు

‘విరాట పర్వం’ సినిమాపై రాఘవేంద్ర రావు ప్రశంసలు

Director raghavendra rao pr

దగ్గుబాటి రానా, టాలెంటెడ్‌ హీరోయిన్‌ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. ఈ మూవీ అనేక అంచనాల మధ్య జూన్‌ 17న విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి మంచి టాక్‌తో దూసుకుపోతోంది. రానా, సాయి పల్లవి నటనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే స్టార్‌ డైరెక్టర్‌ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ‘విరాట పర్వం’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ‘కుర్రవాడైన వేణు ఊడుగుల దర్శకత్వం ఎంతో అద్భుతంగా ఉంది. చాలా అనుభవమున్న డైరెక్టర్‌ అనిపించుకున్నాడు. అలాగే రానా, సాయి పల్లవి నటన ఎక్సలెంట్‌. కచ్చితంగా చూడాల్సిన చిత్రం విరాట పర్వం.’ అని దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు కితాబిచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu