HomeTelugu Trendingభోళా శంకర్‌: మెగాస్టార్‌ మేడే లుక్‌

భోళా శంకర్‌: మెగాస్టార్‌ మేడే లుక్‌

chiranji

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్ర ‘భోళా శంకర్‌’. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే విడుదలైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో భోళా శంకర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ రోజు మే డే సందర్భంగా ఈ సినిమా నుండి చిరంజీవి మాస్‌లుక్ ని విడుదల చేశారు. చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా ఈ పోస్టర్స్ తో మూవీ యూనిట్‌ క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి లుక్ ను చూస్తూ ఉంటే వింటేజ్ చిరంజీవిని చూసినట్లుగా ఉందని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Chiru is at his stylish best in Bholaa Shankars new posters

ఇక ఈ సినిమా ఆగస్టు 11- 2023 లో విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఆగస్టు లో సినిమా విడుదల కాబోతుంది అంటూ క్లారిటీ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ముఖ్య సన్నివేశాలను చిరంజీవి కీర్తి సురేష్ తమన్నా వెన్నెల కిషోర్ మరియు ఇతరులతో తదుపరి షెడ్యూల్ కోల్కత్తాలో ప్రారంభమవుతుంది. చిరంజీవి- తమన్నాలపై ఓ పాటను చిత్రీకరించేందుకు యూనిట్ సభ్యులు యూరప్ వెళ్లనున్నారు.

యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మిగిలిన టాకీ పార్ట్ క్లైమాక్స్ షూట్ భారీ సెట్ సాంగ్ చిత్రీకరించనున్నారు. దాంతో జూన్ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది అంటూ యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తుండగా.. చిరుకు సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సిపిమాకు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu