సూర్య ‘బందోబస్త్‌’ ఫస్ట్‌లుక్‌

స్టార్‌ నటుడు సూర్య హీరోగా నటిస్తున్న సినిమా ‘కాప్పన్’. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. తెలుగులో ‘బందోబస్త్‌’ పేరిట సినిమాను విడుదల చేయబోతున్నారు. లుక్‌లో సూర్య కళ్లజోడు పెట్టుకుని తుపాకీతో పోజివ్వడం ఆకట్టుకుంటోంది. ఇందులో రియల్‌ లైఫ్‌ దంపతులు ఆర్య, సాయేషా కూడా నటిస్తున్నారు.

బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ, మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘రంగం’ సినిమాతో మంచి విజయం అందుకున్న కేవీ ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో అతిథి పాత్రలో కార్తీ మెరవనుండటం విశేషం. హారీస్ జైరాజ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.