‘ఆటోజానీ’ సినిమా ఉంటుందా..?

చిరంజీవి, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో ‘ఆటోజానీ’ సినిమా తెరకెక్కనుందనే మాటలు గతంలో వినిపించాయి. చిరు 150వ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలని చాలా మంది దర్శకులు చెప్పిన కథలు విన్నాడు. అందులో పూరీ చెప్పిన లైన్ నచ్చడంతో దాదాపు ఈ సినిమా ఫైనల్
అయ్యే అవకాశాలు కనిపించాయి. కానీ కథలో రెండో భాగం చిరుకి నచ్చలేదు. దీంతో ‘కత్తి’ రీమేక్ ను ఎన్నుకున్నారు. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

దీంతో చిరంజీవి తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. గీతాఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి దర్శకత్వంలో చిరంజీవి 151వ సినిమా చేయనున్నాడనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. అలానే వరుస సినిమాలతో బిజీగా మారాలని చిరు ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా పూరీ జగన్నాథ్ చెప్పిన కథలో మార్పులు చేయమని చెప్పినట్లు టాక్. చిరంజీవికి నచ్చినట్లు పూరీ సెకండ్ హాఫ్ లో మార్పులు, చేర్పులు చేయగలిగితే వీరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.