HomeTelugu Trending'కొండ పొలం' సినిమాపై చిరంజీవి రివ్యూ

‘కొండ పొలం’ సినిమాపై చిరంజీవి రివ్యూ

chiranjeevi review on konda
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘కొండ పొలం’. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో సాయిబాబా, రాజీవ్ రెడ్డి నిర్మించిన సినిమా ఇప్పుడే చూశాను. నాకెంతో నచ్చింది. ఈ సినిమాకు అవార్డులతో పాటు రివార్డులు కూడా వస్తాయని నాకు నమ్మకం వుంది “. గురువారం రోజు చిరంజీవి తన మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండవ సినిమా “కొండ పొలం “ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ థియేటర్లో చూశారు.

Megastar Chiranjeevi Review On Kondapolam Movie - Sakshi

కొండ ప్రాంతం నేపథ్యంలో నిర్మించిన అందమైన ప్రేమ కథకు చక్కటి సందేశం జోడించి దర్శకుడు క్రిష్ అద్భుతంగా ఈ సినిమాను తెర కెక్కించారని చిరంజీవి ప్రశంసించారు. “క్రిష్ ఎల్లప్పుడూ విభిన్న నేపధ్య కథాంశాలను ఎంచుకొని , వాటిని తనదైన శైలిలో రూపొందించడం , నటీనటుల నుంచి చక్కని నటనను రాబట్టడంలో క్రిష్ సిద్దహస్తుడని చిరంజీవి ట్వీట్ చేశారు. “కొండ పొలం ” సినిమాకు అవార్డులతో పాటు ప్రేక్షకుల నుంచి .ప్రశంశలు వస్తాయని నాకెంతో నమ్మకం ఉందని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి దర్శకుడు క్రిష్ , వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ , నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu