యంగ్‌ హీరోతో కాజల్‌.!


టాలీవుడ్‌ చందమామ కాజల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమా షూటింగులో బిజీగా వుంది. ఈ సినిమాలో ఆమె కమల్‌హాసన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఆ తరువాత ఆమె ఓ యంగ్‌ హీరోకి జోడీగా కనిపించే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో టాక్‌ వినిపిస్తోంది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు .. శ్రీవిష్ణు. అవును, శ్రీవిష్ణు హీరోగా లక్ష్య ప్రొడక్షన్స్ వారు ఒక సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా ప్రదీప్ వర్మ పరిచయం కానున్నాడు.

పోలీస్ డ్రామా నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం కాజల్ ను సంప్రదిస్తున్నారు. కాజల్ అంగీకరిస్తే అది ఈ సినిమాకి కలిసొచ్చే అంశం అవుతుందని భావిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ వంటి హీరోల జోడీగా కనిపించడానికి సైతం ఆసక్తిని చూపుతున్న కాజల్, శ్రీవిష్ణు జోడీగా అలరించడానికి అంగీకరించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates