చిరు సినిమాను రీమేక్ చేయబోతున్న చెర్రీ!

గత కొంతకాలంగా చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రానికి సీక్వెల్
గా సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ కాకుండా
రీమేక్ చేయాలని నిర్మాత అశ్వనీదత్ భావిస్తున్నారు. మెగాభిమానుల సంతోషం
కోసం చిరంజీవి రీమేక్ సినిమాలో చరణ్ ను హీరోగా పెట్టాలని భావిస్తున్నారు. అంతేకాదు
దర్శకుడు రాజమౌళితో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయించాలనేది ఆలోచన. అయితే రాజమౌళి
ప్రస్తుతం బిజీగా ఉండడం వలన మరొక దర్శకుడితో సినిమా పట్టాలెక్కించాలని
భావిస్తున్నాడు. చరణ్ అయితే ప్రస్తుతం దృవ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. షూటింగ్
చివరి దశకు చేరుకుంది. దీని తరువాత సుకుమార్ సినిమా చేయనున్నాడు. ఆ
తరువాత ఈ రీమేక్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates