
James Cameron criticizes Oppenheimer:
హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తాజాగా క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన ‘ఒప్పెన్హైమర్’ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నోలన్ తీసిన ఈ ఆత్మకథా చిత్రం భారీగా అవార్డులు గెలుచుకున్నా, దాని లోపాలపై కామెరూన్ సూటిగా స్పందించారు.
కామెరూన్ ప్రస్తుతం ‘గోస్ట్‌స్ ఆఫ్ హిరోషిమా’ అనే సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా Deadline అనే మీడియాతో మాట్లాడిన ఆయన, “ఒప్పెన్హైమర్ బాంబు వేసిన తర్వాత దాని ప్రభావాలను చూపించకపోవడం మోరల్ కాప్-అవుట్‌లా అనిపించింది,” అని అన్నారు.
అంటే, హిరోషిమా మీద బాంబు వేసిన తర్వాత జనాల పరిస్థితి, వినాశనం చూపించాల్సింది నోలన్ చేయలేదన్నమాట. “ఒప్పెన్హైమర్‌కి బాంబ్ ఎఫెక్ట్స్ గురించి తెలియదా? ఒక సీన్‌లో మాత్రమే కొంతమంది కాలిపోయిన బాడీస్ చూపించి.. తర్వాత అతను బాధపడినట్టు చూపించారు. కానీ నిజమైన బాధ లేదా దాని వాస్తవం ఎక్కడా కనిపించలేదు,” అని కామెరూన్ ఎమోషనల్‌గా చెప్పారు.
దీనికి స్పందనగా, క్రిస్టఫర్ నోలన్ గతంలో చెప్పిన సంగతి ఏమిటంటే – “ఈ సినిమా పూర్తిగా ఒప్పెన్హైమర్ పర్సనల్ పర్స్పెక్టివ్‌లోనే తీశాం. ఆయన నలుగురి కన్నుల్లో ఏమి చూసారో, అదే చూపించాం. బాంబ్ వేసిన తర్వాత బాధితులను చూపిస్తే, ఆ పర్సనల్ నేరేషన్ బ్రేక్ అవుతుంది” అని చెప్పారు.
అయితే జేమ్స్ కామెరూన్ చెప్పింది కూడా కొంచెం నిజమే అని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఓ గొప్ప డైమెన్షన్ మిస్సవిందని భావిస్తున్నవాళ్లున్నారు. ఇప్పుడు ‘గోస్ట్‌స్ ఆఫ్ హిరోషిమా’లో ఆయనే ఆ ఎమోషనల్ వాస్తవాన్ని చూపించబోతున్నారని టాక్.
ALSO READ: నిర్మాతకి చుక్కలు చూపిస్తున్న Tollywood Hero ఎవరంటే..