చిరు కోసం మరో హీరోయిన్ కావాలి!

chiru

 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన రీఎంట్రీ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’లో నటిస్తున్నాడు. ఈ
సినిమాలో మొదట హీరోయిన్ ను వెతకడానికి చిత్రబృందం చాలానే కష్టపడింది. ఫైనల్ గా
కాజల్ ను ఎంపిక చేశారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. దేవి మ్యూజిక్
అంటే సినిమాలో కచ్చితంగా ఐటెమ్ సాంగ్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఓ మాస్ మసాలా
సాంగ్ ను రెడీ చేశాడట. దానికి తగ్గ సన్నివేశాలు కూడా కుదరడంతో ఐటెమ్ గర్ల్ ను వెతికే
పనిలో పడ్డారు. స్టార్ హీరోయిన్ ఈ పాటలో నటిస్తే సినిమాకు హైప్ మరింత పెరుగుతుందని
భావిస్తోన్న చిత్రబృందం తమన్నాను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. తమన్నా ప్రస్తుతం
చాలా బిజీగా ఉంటోంది. ఒకవేల తమన్నా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతే అప్పుడు హంసానందిని
వంటి వాళ్ళను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో..
లేక లైట్ తీసుకుంటుందో.. చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates