HomeTelugu Trending'వివాహ భోజనంబు' నుండి వ్వాటే మ్యాన్‌ సాంగ్‌ విడుదల

‘వివాహ భోజనంబు’ నుండి వ్వాటే మ్యాన్‌ సాంగ్‌ విడుదల

Vivaha Bhojanambu What A

కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వివాహ భోజనంబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ సహా ప్రతిదీ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని యువ నటుడు సందీప్ కిషన్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో.. వివాహ భోజనంబు అనే రెస్టారెంట్స్‌ ని సందీప్ రన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెస్టారెంట్ చైన్ టైటిల్ తోనే వెంకటాద్రి టాకీస్ లో వివహా భోజనంబు సినిమాని నిర్మిస్తున్నారు. సందీప్- సినీష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ప్రతిష్టాత్మక ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అధినేత.. నిర్మాత పి కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రానికి సమర్పకులు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు.

సత్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా వ్వాటే మ్యాన్ సాంగ్ ని విడుదల చేయగా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. పాట ఆద్యంతం ఫన్ ఎలివేట్ చేయడంలో సత్య ఎక్స్ ప్రెషన్స్ ఎంతో అద్భుతంగా కుదిరాయి. ఈ చిత్రానికి అనిరుధ్ విజయ్ (అనీ వీ) సంగీతం అందించగా.. చౌరస్తా రామ్ గానం ఆద్యంతం ఆకట్టుకుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu