HomeTelugu Newskannappa: రంగంలోకి దిగిన లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రభు దేవా

kannappa: రంగంలోకి దిగిన లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రభు దేవా

Choreographer prabhudeva jo

kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ ఎంతో ప్రతిష్టత్మికంగా నిర్మించబడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రెండో షెడ్యూల్‌ను న్యూజిలాండ్ ప్రారంభించారు. కన్నప్ప సినిమా కోసం ఇండియాలోని స్టార్ నటీనటులు అందరూ నటించబోతున్నారు. న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కన్నప్ప కోసం పని చేస్తున్నారు.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈసినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. ఈక్రమంలో కన్నప్ప మూవీకి ఇండియన్ టాప్ కొరియెగ్రాఫర్, ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభు దేవా రంగంలోకి దిగారు.

కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ప్రభు దేవాకు కన్నప్ప టీం స్వాగతం పలికింది. భారతదేశపు ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఇక ఇప్పుడు విష్ణు మంచు తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కన్నప్ప’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు.

పలు పాటలకు కొరియోగ్రఫీని కంపోజ్ చేసే పనిలో ఉన్న ప్రభుదేవా. ఆయన రాకతో కన్నప్ప సినిమా మరో లెవెల్‌కు వెళ్లింది. ప్రభు దేవా కొరియోగ్రఫీ ఎలక్ట్రిఫైయింగ్ సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుంది. రెండో షెడ్యూల్‌ న్యూజిలాండ్‌లో ప్రారంభమైందని కన్నప్ప మూవీ టీం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu