HomeTelugu Newsప్రముఖ దర్శకుడు సాచీ కన్నుమూత..

ప్రముఖ దర్శకుడు సాచీ కన్నుమూత..

9 16
ప్రముఖ మలయాళ దర్శకుడు (48)సాచీ కన్నుమూశారు. ఇటీవల తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. త్రిస్సూర్‌లోని జూబ్లీ మిషన్ ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఈ నెల 16న గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను జూబ్లి మిషన్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే, చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి కన్నుమూశారు. 2015లో దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సాచీ పూర్తిపేరు కేఆర్ సచ్చిదానందన్. పృథ్వీ సుకుమారన్ హీరోగా నటించిన ‘అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్’ చిత్రానికి చివరిసారి పనిచేశారు. ఈ ఏడాది విడుదలైన ‘అయ్యప్పనుమ్ కొషియుం’ సినిమాతో సౌత్‌లో బాగా పాపులర్ అయ్యారు. దీంతో సాచీ ఆకస్మిక మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది. సాచీ మృతి పట్ల మలయాళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

కాగా, సాచీ కోరిక మేరకు ఆయన కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. హాస్పిటల్‌లో కళ్లను దానం ఇచ్చిన తరవాత ఆయన పార్థివదేహాన్ని కోచి తీసుకువచ్చారు. ఆయన కేరళ హైకోర్టులో న్యాయవాది కూడా కావడంతో ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఛాంబర్ హాల్‌లో ఉంచారు. మలయాళ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడ్, లాల్, సురేష్ కృష్ణ, ముకేశ్ తదితరులు సాచీ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

ప్రజలు, సినీ ప్రముఖులు సందర్శన అనంతరం సాచీ పార్థివదేహాన్ని తమ్మనంలోని ఆయన ఇంటికి తరలించారు. అక్కడి నుంచి రావిపురం శ్మశాన వాటికకు అంత్యక్రియల నిమిత్తం తీసుకువెళ్లారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో సాచీ అంత్యక్రియలు నిర్వహించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu