సినీతారల క్రిస్మస్‌ శుభాకాంక్షలు

క్రిస్మస్‌ సంబరాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలు ప్రార్థనలతో మార్మోగుతున్నాయి. ఇక కొందరు సినీ ప్రముఖులైతే వారం రోజుల ముందుగానే క్రిస్మస్‌ వేడుకలను మొదలుపెట్టేశారు. ఇటీవల సమంత, హన్సిక ఇంట్లో క్రిస్మస్‌ చెట్టును అలంకరిస్తున్న ఫొటోలను పోస్ట్‌ చేశారు. అటు బాలీవుడ్‌లోనూ ప్రముఖులను ఇంటికి ఆహ్వానించి పార్టీలను నిర్వహిస్తున్నారు. ఈరోజు క్రిస్మస్‌ను పురస్కరించుకుని సినీతారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటున్నారు.

‘నా స్నేహితులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు’- అక్కినేని నాగార్జున.
‘ప్రేమ, శాంతి..క్రిస్మస్‌ శుభాకాంక్షలు’- అమితాబ్‌ బచ్చన్‌.
‘మీ అందరికీ మ్యాజికల్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు. ఈరోజంతా మీ జీవితాలు ప్రేమ, ఆప్యాయత, సంతోషం వెలుగులతో నిండిపోవాలని కోరుకుంటున్నాను’- మహేశ్‌ బాబు.
‘హ్యాపీ క్రిస్మస్‌. శాంతి, ప్రేమ మీ వెన్నంటే ఉండాలని కోరుకుంటున్నాను’- నరేశ్‌.
‘ఈ క్రిస్మస్‌ పర్వదినాన మీ జీవితం సంతోషాలతో నిండాలని ఆశిస్తున్నాను.’- గోపీచంద్‌.
‘అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు’- అక్షయ్‌కుమార్‌.
‘మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్‌, న్యూఇయర్‌ శుభాకాంక్షలు’- మంచు లక్ష్మి.
‘మెర్రీ క్రిస్మస్‌’- హన్సిక.
‘అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు. ఇప్పటివరకు మీ జీవితాలకు మీరే శాంతాక్లాజ్‌‌గా ఉన్నారు. కానీ మరొకరి కోసం శాంతాక్లాజ్‌‌గా మారడం ఎంతో ఆనందం ఉంటుంది..’- రామ్‌.