HomeTelugu Trending'అక్టోబర్‌15' నుంచి సినిమా థియేటర్లు ఓపెన్‌

‘అక్టోబర్‌15’ నుంచి సినిమా థియేటర్లు ఓపెన్‌

Cinemas halls multiplexes t
లాక్‌డౌన్ కారణంగా దాదాపు ఏడూ నెలలుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అయితే కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ ‘5.ఓ’ గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఈ గైడ్ లైన్స్ లో సినిమా హాల్స్, మల్టీ ప్లెక్స్ లకు అనుమతిచ్చింది. కేంద్రం ఇచ్చిన అనుమతితో అక్టోబర్ 15 నుంచి సినిమా హాల్స్ , మల్టీ ప్లెక్స్ లు రీఓపెన్ కానున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాల విడుదలలు ఆగిపోయాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్‌ అయ్యాయి. ఇక ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాతలంతా తమ సినిమాలను విడుదల చేయడానికి రెడీ అవతున్నారు. షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దసరా, దీపావళి దగ్గరకు రావడంతో సినిమా డేట్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఇక కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ లో భాగంగా సినిమా హాల్స్ , మల్టీ ప్లెక్స్ ల్లో 50 శాతం మాత్రమే సిటింగ్ కు అనుమతి ఇచ్చింది. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా చూసుకోవాలని కేంద్రం తెలిపింది. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ఆధారంగా సినిమా థియేటర్స్ రీఓపెన్ కానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu