HomeTelugu Trending'బంగార్రాజు' ముహుర్తం ఫిక్స్‌

‘బంగార్రాజు’ ముహుర్తం ఫిక్స్‌

Bangarraju shooting will st
టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున ‘బంగార్రాజు’ చేయనున్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్నినాయనా’కి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాని కల్యాణ్‌కృష్ణ కురసాల తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నారు. ఇందులో నాగ్‌ జంటగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతూ సరసన కృతి శెట్టి కనిపించనున్నట్లు తెలిసింది. స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయి. కాగా ఈ సినిమా షూటింగ్‌ ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీని కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్‌ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడా సెట్‌లోనే ముందుగా నాగార్జున, రమ్యకృష్ణలపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశముందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu