ఎన్టీఆర్ అంటే బాలయ్యకు మాటల్లేవ్!

నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు ఎంతో సానిహిత్యంగా ఉండేవారు. ఒకరి సినిమా వేడుకలకు మరొకరు హాజరయ్యి అభిమానులను ఆనందింపజేసేవారు. కానీ గత కొన్నేళ్లుగా వారిద్దరి మధ్య వ్యవహారం చెడినట్లుగా ఉంది. ఇద్దరూ కూడా ఒకరి గురించి మరొకరు మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఎన్టీఆర్ మాత్రం మీడియా నుండి ఎదురయ్యే ప్రశ్నలకు బాబాయ్ కు నాకు ఎటువంటి గొడవలు లేవని మేము బాగానే ఉన్నామని సమాధానం చెబుతున్నాడు. కానీ బాలయ్య మాత్రం ఎన్టీఆర్ గురించి మాట్లాడడానికి అసలు ఇష్టపడడం లేదు. మీడియా నుండి ఎదురయ్యే ప్రశ్నలకు కూడా సమాధానాలు దాటేస్తున్నారు. 
తాజాగా బాలయ్య అభిమానులతో ముచ్చటించినప్పుడు కూడా ఎన్టీఆర్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ ఆయన వేటికీ స్పందించలేదు. సినిమాలు, వ్యక్తిగత జీవితం, రాజకీయాలు ఇలా పలు అంశాల గురించి చర్చించిన బాలయ్య.. ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చినప్పుడు మాత్రం అసలు నోరు మెదపలేదు. దీంతో ఓ అభిమాని ఉండబట్టలేక మిమ్మల్ని అడిగే ప్రశ్నల్లో తొంభై శాతం ఎన్టీఆర్ గురించే ఉన్నాయి. అయినా.. స్పందించరేంటని అడిగాడు. ఆ మాటలను కూడా బాలయ్య పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఒక్క సంఘటన బట్టి తెలుస్తోంది.. బాబాయ్-అబ్బాయ్ ల మధ్య బంధం ఎలా ఉందో!