Homeతెలుగు Newsమాణిక్యాలరావు లేఖపై స్పందించిన చంద్రబాబు

మాణిక్యాలరావు లేఖపై స్పందించిన చంద్రబాబు

9 22మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు రాసిన లేఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. తన నియోజకవర్గాన్ని, పశ్చిమగోదావరి జిల్లాను రాష్ట్రప్రభుత్వం సరిగా పట్టించుకోవడంలేదంటూ ఆయన చేసిన ఆరోపణల్ని సీఎం కొట్టిపారేశారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికార, విపక్షాలనే వివక్ష తమ ప్రభుత్వానికి ఉండదని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధిపై 15 రోజుల్లో ప్రకటన చేయాలని మాణిక్యాలరావు గడువు విధించారు. లేకపోతే 16వ రోజున తాను ఈరోజు రాసిన ఈ లేఖనే రాజీనామా లేఖగా పరిగణించాలని కోరారు. 16వ రోజున తాను నిరసన దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

మాణిక్యాలరావు రాసిన లేఖపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పోలవరం నిధుల కోసం మాణిక్యాలరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉంటే సంతోషించే వాడినని వ్యాఖ్యానించారు. రాజకీయo కోసం ఆయన రాజీనామా చేస్తాననడాన్ని తప్పుపట్టారు. మంగళవారం మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఎం ఈ విధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే మాణిక్యాలరావు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన దాఖలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. మాణిక్యాలరావు దీక్ష చేయాల్సి వస్తే ఢిల్లీకి వెళ్లి చేయాలని సూచించారు. కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణం ఎన్డీయే కాదా? అని సీఎం నిలదీశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu