‘మహర్షి’ ఫస్ట్‌ సాంగ్‌ సూపర్బ్‌

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘మహర్షి’ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది. ‘చోటీ చోటీ బాతే.. మీఠీ మీఠీ యాదే’ అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. ఈరోజు నుంచి ‘మహర్షి’ మ్యూజికల్‌ జర్నీ షురూ అవుతుందని చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయినగా నటించారు. ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర పోషించారు. ముగ్గురు స్నేహితుల మధ్య చోటుచేసుకున్న సన్నివేశాల ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ పాటను దేవిశ్రీ ప్రసాదే ఆలపించారు. మే 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates