మనవడితో రన్నింగ్ రేస్‌ చేస్తున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. సార్వత్రిక ఎన్నికల సమయంలో విరామం లేకుండా రాష్ట్రాన్ని చుట్టేశాడు. అయితే ఆయనకు ఇప్పుడు కాస్త సమయం దొరికింది. మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడడంతో ఇవాళ చంద్రబాబు ఆయన మనవడు దేవాన్ష్‌తో సరదాగా గడిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో దేవాన్ష్‌తో కలిసి ఉల్లాసంగా చంద్రబాబు రన్నింగ్ రేస్‌లో పాల్గొన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు మంత్రి నారా లోకేష్… ”ప్రజా విజయం కోసం అనుక్షణం ప్రజలతో మమేకమై, విరామం లేకుండా 110 ప్రచార సభలలో పాల్గొన్న చంద్రబాబు గారికి, కుటుంబంతో గడిపేందుకు కాస్త తీరిక దొరికింది. ఇదిగో ఇలా తాతామనవళ్ళు ఇద్దరూ సరదా సమయాన్ని గడుపుతున్నారు” అంటూ ఫోటో జత చేసి ట్వీట్ చేశారు లోకేష్.