HomeTelugu Newsవైఎస్సార్‌ మత్స్యకార భరోసా ప్రారంభించిన జగన్‌

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా ప్రారంభించిన జగన్‌

12 13ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ముమ్మిడివరం మండలం కొమనాపల్లిలో సీఎం జగన్‌ వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. కొమానపల్లిలో టూరిజం బోటింగ్‌ కంట్రోల్‌ గదులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ పథకo లో రాష్ట్రం మొత్తం మీద ఈ పథకం 1.35 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. మత్స్యకార కుటుంబాలుకు సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునే సాయాన్ని…. పదివేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణిస్తే… వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద 10 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నారు.

తొమ్మిది కోస్తా తీర జిల్లాల్లో దశల వారీగా ఫిష్‌ లాండింగ్‌ సదుపాయాలను కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మూడు కొత్త ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు జగన్. మర పడవల నిర్వాహకులకు లీటర్ డీజిల్‌కు ఇచ్చే రాయితీని…తొమ్మిది రూపాయలకు పెంచారు. పేద పిల్లలు కూడా కలెక్టర్లు అయ్యే స్థాయిలో ఇంగ్లీష్ మీడియా చదవులను అమలు చేయబోతున్నామన్నారు జగన్. బడుగు బలహీన వర్గాల ప్రజలు బతుకులను మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా విపక్షాలు ప్రభుత్వంపై దుష్ర్పచారం చేస్తున్నాయని విమర్శించారు. పెద్ద పెద్ద వాళ్ల పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివితే పేదల పిల్లలు తెలుగు మీడియంలో చదవాలా అని ప్రశ్నించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu