Homeపొలిటికల్నేను ఒంటరి వాడిని కాను.. దేవుడు, ప్రజలే నా తోడు: జగన్

నేను ఒంటరి వాడిని కాను.. దేవుడు, ప్రజలే నా తోడు: జగన్

Jagan Denduluru
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు సైతం ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇవాళ ఏలూరు జిల్లాలోని దెందులూరులో ‘సిద్ధం’ పేరుతో జగన్ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సభకు జన సమీకరణ కోసం వైసీపీ నేతలు బాగానే కష్టపడ్డారు. అయితే జగన్ సభపై విపక్షాలు పలు విమర్శలు గుప్పించారు.

సీఎం సభ కోసం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షను సైతం వాయిదా వేశారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఏలూరు జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షల పేరుతో పోలీసులు ఇబ్బందులు పెట్టారని సామాన్య ప్రజలు వాపోయారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారని, స్కూలు బస్సులను సీఎం సభకు ప్రజలను తరలించేందుకు వాడుకున్నారని ఆరోపించారు. బస్సుల కోసం స్కూలు యాజమాన్యాలపై అధికారులు, వైసీపీ నేతలు బెదిరింపులకు సైతం దిగారని ఆరోపణలు చేశారు. వివిధ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులను వైసీపీ సభ కోసం కేటాయించారని మండిపడుతున్నారు.

ఇప్పటికే జగన్ ప్రజల్లోకి వెళ్లాలంటే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అలాగే సీఎం వస్తుంటే చెట్లు కొట్టేస్తున్నారని, దుకాణాలు మూసివేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా దెందులూరు సభకు పంట కాల్వ ఛానల్‌ను మట్టితో కప్పేశారని, రోడ్డుపైన డివైడర్‌ను సైతం ధ్వంసం చేశారని ఆరోపించారు. ఎన్నికల సభ కోసం అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు.

ఏలూరు జిల్లా దెందులూరు సభలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భవిష్యత్తులో మరింత మంచి పరిపాలన అందించేందుకు, మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమేనా అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. కరోనా లాంటి ఎల్లో వైరస్, దుష్టచతుష్టయంపై యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి మీరు సిద్ధమేనా అన్నారు. అదే విధంగా రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ మన రాష్ట్రంలోనే ఉన్నారని దుయ్యబట్టారు.

వారివైపు నుంచి చూసినప్పుడు ఎంతోమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడిగానే కనిపిస్తాడు కానీ ఈ సభలో కనిపిస్తున్నది నిజం. ఎన్నో కోట్లమంది హృదయాల్లో స్థానం ఉన్న నేను ఒంటరి వాడిని కాదు అన్నారు. హామీలు ఇచ్చి మోసాలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటేనని, ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోకు విశ్వసనీయత తెచ్చింది తానేనని జగన్ చెప్పుకొచ్చారు.

ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ రావాలని, వైసీపీ సంక్షేమ పథకాలను ఇంటింటికి చెప్పాలని పిలుపునిచ్చారు. 124 సార్లు ప్రజల కోసం నేను బటన్ నొక్కాను.. నాకోసం రెండుసార్లు ఫ్యాన్‌మీద బటన్ నొక్కితే చంద్రముఖి బాధ ఉండదని జగన్ అన్నారు. ప్రతిపక్షాలకు ఓటు వేయడం అంటే ఈ పథకాల రద్దుకు ఆమోదం చెప్పినట్టేనని

Recent Articles English

Gallery

Recent Articles Telugu