HomeTelugu Trending'యాత్ర 2' నుండి జగన్‌ స్పెషల్‌ పోస్టర్‌

‘యాత్ర 2’ నుండి జగన్‌ స్పెషల్‌ పోస్టర్‌

cm jagan birthday special p
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వచ్చి మంచి హిటైన చిత్రం ‘యాత్ర’. తాజాగా యాత్రకు సీక్వెల్‌గా యాత్ర 2 మూవీ రానుంది. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక నిర్మిస్తున్న యాత్ర 2 చిత్రాన్ని మహి వి రాఘవ్ తెరకెక్కించారు.

ఇందులో తండ్రి వైఎస్సార్ మరణం, తర్వాత నాయకునిగా జగన్ ఎదిగిన తీరుతోపాటు 2009 నుంచి 2019వరకు ఏపీలో జరిగిన రాజకీయ సంఘటనలు ఉండనున్నట్లు సమాచారం. యాత్ర 2లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగా తమిళ నటుడు జీవా చేస్తున్నాడు. అలాగే ఇందులో చంద్రబాబు నాయుడు పాత్రలో పాపులర్ యాక్టర్ మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ రోజు (డిసెంబర్ 21) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా యాత్ర 2 నుంచి ఆయన లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అటువైపు కుర్చీలో మమ్ముట్టి కూర్చుని ఉంటే ఇటువైపు జగన్ కూర్చుని ఉన్నారు. “నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ, ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కొడుకుని” అంటూ పోస్టర్‌పై అదిరిపోయే డైలాగ్ చూపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu