Yatra: ఏపీ సీఎం జగన్ నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా వస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. 2019లో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమకి మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో వైఎస్. రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి, జగన్ పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌తో పాటు సాంగ్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ గమనిస్తే.. ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.
రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం, జగన్ జైలుకు వెళ్లడం, జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు.. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాత్ర 2 సినిమా రానుంది. ఇక చివరిలో నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ జీవా చెప్పే డైలాగ్ ట్రైలర్ కే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.