మాధవన్ క్రేజ్ గురించి చెప్పిన చైతన్య

అక్కినేని నాగ చైతన్య నటించిన కొత్త చిత్రం ‘సవ్యసాచి’ వచ్చే నెల 2వ తేదీన విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చేసిన స్టార్ నటుడు మాధవన్ సైతం హాజరయ్యారు.

ఈ సందర్బంగా చైతన్య మాధవన్ క్రేజ్ గురించి చెబుతూ షూటింగ్ జరిగేటప్పుడు అమ్మాయిలు తనకు ఫోన్ చేసి లొకేషన్ కు రావొచ్చా.. మాధవన్ ను చూడొచ్చా అని అడిగేవారని, ఆయన క్రేజ్ అలాంటిదని, ఆయన తమ సినిమాలో నటించడంతో సినిమాపై నమ్మకం మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు.