Homeతెలుగు Newsవివేకానంద రెడ్డి మృతి పట్ల చంద్రబాబు స్పందన

వివేకానంద రెడ్డి మృతి పట్ల చంద్రబాబు స్పందన

7 14మాజీ మంత్రి, జగన్‌ చిన్నాన్న వివేకానంద రెడ్డి మృతి పట్ల అనుమానాలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు, కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. వివేకానందరెడ్డి మృతిపై అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరపాలని సూచించారు. దోషుల్ని వెంటనే అరెస్టు చేసి, నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని సీఎం అధికారులను సూచించారు. వివేకానంద రెడ్డి మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తంచేయడంపై అప్పటికప్పుడు డీజీపీ, ఇంటెలిజెన్స్‌, కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. వివేకా కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

వైఎస్‌ వివేకానంద అనుమానాస్పద మృతిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేస్తున్నట్లు కడప ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ వెల్లడించారు. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఈ సిట్‌ ఏర్పాటైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu