వివాహ బంధంతో ఒక్కటైన నరేష్‌-పవిత్ర

సీనియర్‌ నటుడు నరేష్‌, నటి పవిత్రను వివాహం చేసుకున్నాడు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఈ జంట తాజాగా విడుదల చేసింది. ఒక పవిత్ర బంధం, రెండు మనుసులు, మూడు ముళ్లు, ఏడడుగులు, మీ ఆశిస్సులు కోరుకుంటూ పవిత్ర నరేష్‌ అంటూ పెళ్లి వీడియోను నరేష్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు.

కాగా పవిత్రతో నరేష్‌ గతకొంత కాలంగా సహజీవనం చేస్తున్న సంగితి తెలిసిందే. న్యూఇయర్‌ సందర్భంగా ఈ జంట రిలీజ్‌ చేసిన లిప్‌కిస్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు రావడం పెద్ద దుమారం లేపింది.

మైసూర్‌లోని ఓ హోటల్‌లో ఇద్దరూ కలిసి ఉండగా.. నరేశ్‌ మాజీ భార్య రమ్య రఘుపతి వారిని పట్టుకున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. అయితే అప్పటికి నరేష్‌కి మూడో భార్యతో విడాకులు కాలేదు. అందువలనే పెళ్లి గురించి ఆలోచిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చింది.

గ‌తంలో నరేష్‌ మూడో భార్య మీడియా ముందుకు వ‌చ్చి తనకి పిల్లలు ఉన్నారని ఇంకా సెటిల్ చేయకుండా పెళ్లి చేసుకోవడం ఏంటని నరేష్ ని ప్రశ్నించింది. కాగా ఆ వార్తలపై ఆ మధ్య పవిత్ర స్పందించి తామింకా పెళ్ళి చేసుకోలేదని, లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నామని తెలిపింది. అంతేకాకుండా వీళ్ల బంధానికి కృష్ణ గారి ఫ్యామిలీ నుండి ఆమోదం ఉన్నట్లు కూడా తెలిపింది.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates