మహేష్ కోసం భారీ అసెంబ్లీ సెట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ‘శ్రీమంతుడు’ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మరోసారి వీరిద్దరు కలిసి పని చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఇటీవలే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. మహేష్ ‘స్పైడర్’ సినిమాతో బిజీగా ఉండడంతో ఆయన లేకుండా కొరటాల శివ మొదటి షెడ్యూల్ పూర్తి చేశాడు. గతవారం హైదరాబాద్ లో మొదలైన షెడ్యూల్ లో మహేష్ చిన్నప్పటి సన్నివేశాలను చిత్రీకరించారు. 
రెండో షెడ్యూల్ జూన్ 16నుండి మొదలుకానుంది. ఈ షూటింగ్ లో మహేష్ పాల్గొంటాడని సమాచారం. ఈ సినిమాలో మహేష్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. దీనికోసం హైదరాబాద్ సిటీ శివార్లలో ఒక భారీ అసెంబ్లీ సెట్ ను నిర్మిస్తున్నారు. ఈ సెట్ దాదాపు పూర్తి కావచ్చింది. సినిమాలో మహేష్ అసెంబ్లీలో మంత్రులపై వేసే పంచ్ డైలాగ్స్ హైలైట్ అవుతాయని చెబుతున్నారు. ముందుగా ఆ సీక్వెన్స్ ను పూర్తి చేయాలని కొరటాల శివ భావిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుంది.